సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్
మొయినాబాద్ మే 21(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్ నగర్ వారి నివాసంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి(సిఎంఆర్ఎఫ్) నుండి వచ్చిన చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు. చేవెళ్ళ, శంకర్ పల్లి, నవాబ్ పెట్, మొయినాబాద్, షాబాద్ మండలాల సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. 20,59,000/-(ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు) ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం పేదల వరం అని తెలిపారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండలం అధ్యక్షులు మాణయ్య, నవాబ్ పెట్ మండల అధ్యక్షులు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట రెడ్డి, షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.