కోర్టులో ఏసీబీ దాడులు
– ఏసీబీ వలలో మరో ఇద్దరు అధికారులు
– ఏపీపీ చాంబర్ లోనే పట్టుకున్నాం
– ఏసీబీ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ వెల్లడి
కామారెడ్డి ప్రతినిధి, మే 23(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా కోర్టు లో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఒ కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అధికారులు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని సిబ్బంది గాని ఎవరైనా వేదిస్తే ఇబ్బందులకు గురి చేస్తే టోల్ ఫ్రీ1064 ను ఆశ్రయించాల్సిందిగా ప్రజలను కోరడం జరుగుతుంది. పదివేల రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు అని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. వారిని త్వరలో నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరస్తామని తెలిపారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను ఎవరైనా లంచాలు అడిగితే ఏసీబీ ని ఆశ్రయించాలని ఏసిబి డిఎస్పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
