Praja Kshetram
ఆరోగ్యం

తెలంగాణలో కోవిడ్ 19.. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు పాజిటివ్‌.. బి కేర్ ఫుల్

తెలంగాణలో కోవిడ్ 19.. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు పాజిటివ్‌.. బి కేర్ ఫుల్

 

హైదరాబాద్ మే 23(ప్రజాక్షేత్రం):యావత్ ప్రపంచాన్నీ వైరస్‌తో వణికించిన కోవిడ్ 19 మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో కోవిడ్ 19 కేసు నమోదు నమోదైంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఒక డాక్టర్‌కు కోవిడ్ 19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కోవిడ్ 19 వైరస్ (కోవిడ్ 19) తెలంగాణలో మొదటి సారిగా 2020 మార్చి 2న తొలి కోవిడ్ 19 వైరస్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వైరస్ కేసులు లక్షల్లో నమోదుకావడం, రెండు సార్లు లాక్ డౌన్లతో మొత్తం జనజీవనం స్థంభంచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ 19తో కకావికలమైంది. ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి..

Related posts