Praja Kshetram
విద్యా సమాచారం

తెలంగాణ పాలిసెట్ 2025.. ఫ‌లితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్ 2025.. ఫ‌లితాలు విడుదల

 

హైదరాబాద్ మే 24(ప్రజాక్షేత్రం):టీజీ పాలిసెట్ -2025 ఫ‌లితాలు శనివారం విడుదలయ్యాయి. మాస‌బ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండ‌లి కార్యాల‌యంలో సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ ఏ. దేవ‌సేన ఫలితాలను విడుద‌ల చేశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 84.33 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఎంపీసీ విభాగంలో 81.88 శాతం, ఎంబైపీసీలో 84.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. 1,06,716 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 98,858 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో 83,364 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

Related posts