ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్ మే 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్ సీ గణితం విద్యార్థులు లేటరల్, ఎంట్రీ ద్వారా బీటెక్ బి ఫార్మసీ, కోర్సుల్లో చేరేందుకు మే 12న నిర్వహించిన ఈసెట్ 2025 పరీక్ష ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈసెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి,విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈసెట్ ఫలితాల్లో మొత్తం 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇక ఎప్పటి మాదిరిగానే అన్ని విభాగాల్లో అమ్మాయి లు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసి ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.