Praja Kshetram
క్రైమ్ న్యూస్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్?

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్?

 

 

ఖమ్మం జిల్లా మే 26(ప్రజాక్షేత్రం):లంచం తీసుకుంటూ ఏసీపీ కి పట్టుబడింది ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణ.ఆమెను ఏసీబీ అధికారులు ఈరోజు వలవేసి నేరుగా పట్టుకున్నారు.వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా,రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2వేల గజాలు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణ ను ఆశ్రయించగా రూ.యాభై వేలు డిమాండ్ చేసింది.దీంతో గత్యంతరం లేక బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.ఈ మేరకు సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా రూ.30 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి చేసి పట్టుకున్నారు.గత 9 నెలల క్రితమే సబ్ రిజిస్టర్ అరుణ వరంగల్ జిల్లా నుంచి బదిలీ పై రూరల్ కు వచ్చింది.ఈ దాడుల్లో ఏసీబీ అధికారు లు పాల్గొన్నారు.

Related posts