Praja Kshetram
తెలంగాణ

కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

 

 

సిరిసిల్ల మే 27(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందిన సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ ఫోటో పెట్టకుండా కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను డీసీఎం వాహనాల్లో పోలీసులు స్టేషన్ కు తరలించారు. పోలీసుల లాఠీ ఛార్జిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై బీఅర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించి వారి దౌర్జన్యాన్ని అడ్డుకోచూసిన మాపై లాఠిచార్జీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts