Praja Kshetram
తెలంగాణ

మందుబాబులకు అడ్డాగా మారిన వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

మందుబాబులకు అడ్డాగా మారిన వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

 

– వేసవి సెలవుల్లో సైతం తరగతి గదులకు తాళాలు వేయ్యని వైనం.

– ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే నాధుడే లేడా.

ఎర్రవల్లి, మే 26(ప్రజాక్షేత్రం):జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని తరగతి గదులకు వేసవి కాలం సెలవుల్లో కూడా తాళాలు వేయ్యడం లేదు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోపమా లేదా ప్రభుత్వ పాఠశాలలు అనే లోకువ అర్థం కావడం లేదు. ఇదే చనువుగా మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు మందుబాబులు పాఠశాల గదిలో,కాంపౌండ్ లో కూర్చుని దర్జాగా మద్యం తాగుతున్నారు. తాగిన తర్వాత సీసాలు అక్కడే వదిలేసి వెళుతున్నారు. వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు. మందుబాబులు మందు ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవించడంతో అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల పట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.ఇకనైనా అధికారులు, గ్రామస్తులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్పందించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేయాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.

Related posts