Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో గోల్డ్ మెన్ సందడి..

తిరుమలలో గోల్డ్ మెన్ సందడి..

 

– మెడ నిండా నగలతో శ్రీవారి దర్శనం..

– ఎన్ని కిలోలో తెలిస్తే షాక్..

తిరుపతి మే 26(ప్రజాక్షేత్రం):తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి అలంకరించిన వజ్ర వైడూర్యాల ఆభరణాలు తళుక్కు మంటాయి. వెలకట్టలేని స్వర్ణా భరణాలున్న శ్రీవారు ఎన్నో ఆభరణాలతో భక్తులకు రోజూ దర్శన భాగ్యం కలిగిస్తారు. అయితే తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తులు కూడా కిలోల కొద్ది ఆభరణాలతో దర్శనమివ్వడం అందరినీ ఆకర్షించింది. హైదరాబాద్ కు చెందిన విజయ్ కుమార్ అనే భక్తుడు బెంగళూరుకు చెందిన మల్లికార్జున అప్పాజీ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని వీఐపీ బ్రేక్ క్యూ లో కనిపించారు. ఆలయ మహా ద్వారం వద్దకు రాగానే ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన విజయ్ కుమార్ ఆలయంలోని భక్తులను ఆకట్టుకున్నాడు. మెడనిండా బంగారు గొలుసులు వేసుకుని ఆపద మొక్కుల స్వామిని దర్శించుకున్న విజయ్ కుమార్ ను చూసి భక్తులు ఆలయం ముందు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

Related posts