Praja Kshetram
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యం

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యం

 

– జాబితాల్లో తాము సూచించిన వారి పేర్లుండాలంటున్న కాంగ్రెస్‌ నాయకులు.

– అనర్హుల పేర్లను తొలగిస్తున్న ఆఫీసర్లుఇరువురి మధ్య కొనసాగుతున్న పంచాయితీ.

– మిగిలిన కొంతా మంది లబ్ధిదారులకు గుండు సున్నానే.

– ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా అనర్హుల ఎంపికపై అధికారుల అసంతృప్తి.

చేవెళ్ల, మే 27(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు.సీఎంతోపాటు మంత్రులు అర్హులనే ఎంపిక చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నది. ప్రతి గ్రామంలోనూ ఇండ్లు లేని నిరుపేదలు ఐదారుగురు మినహా ఉండరు, కానీ, ఒక్కో గ్రామంలో పదికి పైగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారనే విమర్శలున్నాయి. చేవెళ్ల మండలం బస్తేపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజల పంచాయతీ. మా గ్రామంలో ఇందిరమ్మ లిస్ట్ లో గ్రామ కమిటీ చైర్మన్ అత్యుత్సాహం మొదట లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించి మీరు గ్రామం నుంచి పంపిన లిస్ట్ వచ్చిన లిస్ట్ ఏది అని అడిగితే తలతిక్క సమాధానం వెరిఫికేషన్ కి వచ్చిన ఇల్లు లేదు మొదటి ప్రాధాన్యతలో మూడవ లిస్ట్ పేర్లు ప్రత్యక్షం ఇదేంటని గ్రామపంచాయతీ వాళ్ళని అడిగితే పై అధికారుల మీద చెప్పడం లిస్ట్ సైతం గ్రామపంచాయతీ నోటీస్ పోర్ట్ లో లేదు గ్రామ వాట్సాప్ గ్రూప్ లలో సెలక్షన్ అయినవారికి ఇచ్చిన వారికి కేటాయింపులు మాత్రం తొమ్మిది మందికి ఇల్లు కేటాయింపు చేస్తున్నామని గ్రామపంచాయతీ వారు చెప్పిన విధానం.

Related posts