రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ
ఢీల్లీ మే 27(ప్రజాక్షేత్రం):పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. శోభన.. మలయాళ సినిమా నటి, భరతనాట్య నృత్యకారిణిగా 40 ఏళ్లకు పైగా సినిమా, నృత్య రంగాల్లో చేసిన కృషికి గాను పద్మభూషణ్ అందుకున్నారు. ఆమె 80కి పైగా సినిమాల్లో నటించి.. రెండు జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు. మందకృష్ణ మాదిగ.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడిగా, దళితుల హక్కుల కోసం, మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందారు. 2025 పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2025న ఈ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.