వట్టి నాగులపల్లి వాసికి దళితరత్న అవార్డు
రాజేంద్రనగర్, జూన్ 01(ప్రజాక్షేత్రం):అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ మాలల సమితి దళిత రత్న అవార్డు 2025ను రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ వట్టి నాగులపల్లి గ్రామ వాసి జిల్లా అధ్యక్షులు దార రాజుకుమార్,తెలంగాణ మాలల సమితి ఆధ్వర్యంలో శనివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి చేతుల మీదిగా దళితరత్న 2025 అవార్డును అందుకున్నారు, దళితుల ఐక్యతతో సామాజిక కార్యక్రమాభివృద్ధికి తోడ్పడతానని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. దళితుల సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని అవార్డు అందుకున్న దార రాజుకుమార్ మాట్లాడారు. తెలంగాణ మాలల సమితికి చెందిన రాష్ట్ర నేతలు రావుల చందర్, జెట్టి విజయ్ కుమార్, పత్తి శ్రావణ్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షులు బరిగెల వెంకటస్వామి కార్యనిర్వాహక కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ రాజు ఉపాధ్యక్షుడు మన్నెo వీరస్వామి, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి గజ్జల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.