Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో భారీగా పెరిగిన రేషన్ కార్డులు.. మీకూ కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

తెలంగాణలో భారీగా పెరిగిన రేషన్ కార్డులు.. మీకూ కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

 

హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం (ఒక్కో లబ్ధిదారుడికి) ఒకేసారి ఇవ్వనున్నారు. తెలంగాణలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండేవారు. అంటే ఇప్పుడు 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత పొందారు. అలాగే, మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు పెరిగింది. అంటే 2 లక్షల కొత్త కార్డులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 20 లక్షల అప్లికేషన్లను వెరిఫికేషన్ చేయగా, 18 లక్షల మందికి అర్హత లభించింది. జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం (ఒక్కో లబ్ధిదారుడికి) ఒకేసారి ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్లు, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులపై కార్యాచరణ చేపట్టారు. కొత్తగా జారీ చేసిన 2 లక్షల కార్డుల కింద 9 లక్షల కొత్త లబ్ధిదారులకు రేషన్ లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగడం ద్వారా అధిక మంది ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతోంది. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడం ద్వారా లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. మిగతా దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి సంబంధించిన వెరిఫికేషన్‌ను కూడా నిర్వహిస్తామని, రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Related posts