సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ..
హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):పద్మశ్రీ పురస్కారగ్రహీత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదివారం ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా సామాజిక న్యాయం తో పాటు ఎస్సీ వర్గీకరణ కృషిని సీఎం ఎంతగానో కొనియాడారు. ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను మంద కృష్ణ మాదిగ సీఎం రేవంత్తో ప్రస్తావిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.