ఏందయ్యా…. హైతబాద్ లో ఈ అక్రమాలు
ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధం మరియు దాని వల్ల పర్యావరణానికి మరియు ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. ఇది చట్టపరమైన చర్యలకు మరియు జరిమానాలకు దారితీస్తుంది. మరియు దానివల్ల పర్యావరణానికి మరియు ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. అందువల్ల, అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడటం మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం
– షాబాద్ మండలంలో హైతబాద్ పరిధిలో సర్వే నంబర్ 350 లో ఎర్ర మట్టి మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది.
– అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు అక్రమ ఎర్రమట్టి విక్రయిస్తున్నారు.
– ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు గద్దల వాలిపోతారు.
– ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చట్టవిరుద్ధం
– ఏటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎర్ర మట్టి టవకాలు.
షాబాద్, జూన్ 04(ప్రజాక్షేత్రం):మట్టి మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దందా కొనసాగిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన మట్టిని తరలించేస్తున్నారు. ఈ తవ్వకాలతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి విలువైన వనాలు నేలకూలుతున్నాయి.షాబాద్ మండలంలోని రెవెన్యూ పరిధిలో మట్టి మాఫియా అక్రమ తవ్వకాలకు తెరలేపింది. హైతాబాద్ రెవెన్యూ ప్రాంతంలో పెద్ద సోల్పేట్ సర్వే నంబర్ 350 మొత్తం 120 ఎకరాలు. https://maps.app.goo.gl/WuYM229gijxaFFZB7 గూగుల్ మ్యాప్ ఆధారాలతో. ప్రభుత్వ భూములను గోరాతి ఘోరంగా అక్రమంగా తవ్వకాలు తీస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నుండి తవ్వకాలు చేసి దగ్గర్లో ఉన్న కంపెనీలకు తరలిస్తున్నారు.ఒక టిప్పర్ మట్టి 4000 నుంచి 8,000 వరకు టిప్పర్ నంబర్ ప్లేట్ AP26TF2184,TS07UP1035 టిప్పర్లతో కంపెనీలలో డంపింగ్ చేసి అమ్ముతున్నారు. ప్రభుత్వ భూములు కనిపిస్తే మట్టి మాఫియా పదేపదే తోవ్వుకుంటుంది రాత్రి వేల టిప్పర్లతో తరలిస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో ,ఈ దందా సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలోని రెవెన్యూ పంచాయతీ కార్యదర్శులు మట్టి అక్రమ రవాణా జరుగుతున్న చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుడండంతో ప్రభుత్వ భూములు గుంతలుగా మారి నీళ్లు నిలిచాయి, చెడిపోతున్నాయి ఆ గుంటలలో పడి ఎవరైనా గొర్ల కాపరి కానీ మేకల కాపరి కానీ అందులో పడితే ప్రాణాలకే ప్రమాదంగా మారింది. మండల శాఖ అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను, మట్టిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వ్యాపారులు తమ వ్యాపారాన్ని యధేశ్చగా కొనసాగిస్తున్నారు. మండల అధికారులు వెంటనే స్పందించి మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
– సర్కారు జాగా ఉందంటే వారికి పండగే
సర్కారు జాగా ఉందంటే వారికి పండగే. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను అక్రమంగా కొనసాగుతున్న ఎర్రమట్టి దండ. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మౌనం వీడడం లేదు. ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు ఆ గ్రామస్తులు, అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఓనర్లు ఎంతమందికి విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. చివరకు షాబాద్ ఎమ్మార్వో సైతం ఇటీవల ఫిర్యాదు చేశారు. అయినా, ఫలితం లేకుండా పోతోంది. అధికారులు దీనిని అడ్డుకోవడం అటుంచి అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. అధికారులకు మామూలు ముడుపులు మూడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎర్రమట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో… హైతాబాద్ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్నిరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. హైతాబాద్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు అర్ధరాత్రి 8 గంటల నుంచి 3 గంటల వరకు మట్టిని తరలిస్తున్నారు. ఒక రాత్రి సంపాదన అన్ని పొగ 10వేలు లాభం, దాదాపు ఒక రెండు వారాలు దందా కొనసాగించిన 1,40,000 వస్తుందని ఆరోపణలు. గతంలో పోలీసులు, అధికారులు టిప్పర్లను పట్టుకొని జరిమానా వేసేవారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. టిప్పర్ ఎర్రమట్టి 4000, గరుసు 8000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్ నడిపే వ్యక్తుల సమాచారం హిటాచికి 1200, టిప్పర్ కి 1000 రూపాయలు, మిగిలినవి దందా చేసే వారికి అని ఆరోపణలు. మట్టి అక్రమ తవ్వకాలతో భారీగా గుంతలు పడి… భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఎంతో విలువైన , ఈ భూముల్లోని సారవంతమైన ఎర్రమట్టిని తరలించేయడం వల్ల ఈ భూములు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదముందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
– అధికారుల అండదండలతోనే ఈ దందా నడుస్తోందా?
హైతబాద్ గ్రామం లో ఉన్న ఆయా గ్రామాల పరిధిలోని రెవెన్యూ పంచాయతీ కార్యదర్శులు మట్టి అక్రమ రవాణా జరుగుతున్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముందు ఎన్నో పత్రిక కథలనలో వచ్చిన ఒక్కసారి మాత్రమే టిప్పర్ సేల్స్ చేసి జరిమానా వేసి మళ్లీ వదిలేశారు. ఎర్రమట్టి మాఫియా మళ్లీ దంతా కి దిగారు. ఎన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు సమాచారం అందినప్పుడు పట్టుకుంటున్నారు, వదిలేస్తున్నారు, ఇంకా ప్రభుత్వ భూములు కాపాడే అధికారులే తమ్ముడు పోతున్నారని ఆరోపణలు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు చుట్టుపక్కల ఉన్న ప్రజలు రైతులు ఆరోపిస్తున్నారు. కరెంటు స్తంభాలు ఉన్నాయని కూడా లెక్కచేయకుండా ఎర్రమట్టి తవ్వారు ఇది ఎంతటి దారుణం అని అక్కడ ఉన్న రైతులు ఆవేదన చెందుతున్నారు.