Praja Kshetram
తెలంగాణ

ఇంటిపై పడిన పిడుగు.. విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం

ఇంటిపై పడిన పిడుగు.. విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం

 

 

బాన్సువాడ జూన్ 09(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వర్ని మండల కేంద్రంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. మండల కేంద్రంలోని మెహర్ బాబా కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ భవనం పిల్లర్పై పిడుగు పడింది. దీంతో పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని విద్యుత్ మీటర్ కాలిపోగా.. ఇతర విద్యుత్తు ఉపకరణాలు చెడిపోయాయి. చుట్టుపక్కల నాలుగు ఇళ్లలో కూడా విద్యుత్ ఉపకరణాలు చెడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా పడి పిడుగు పడింది.

Related posts