Praja Kshetram
తెలంగాణ

అణగారిన వర్గాలు మందకృష్ణ మాదిగ సారధ్యంలో ఐక్యం కావాలి.

అణగారిన వర్గాలు మందకృష్ణ మాదిగ సారధ్యంలో ఐక్యం కావాలి.

 

– దేశవ్యాప్తంగా పీడిత వర్గాలను ఏకం చేద్దాం,

– అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు నడుద్దాం.

– జులై 7న మాదిగల ఆత్మగౌరవ ప్రతీకైన ఎమ్మార్పీఎస్ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలి

– విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి

– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ

చేవెళ్ల జూన్ 11(ప్రజాక్షేత్రం):సామాజిక ఉద్యమాల సారధి, ప్రజా ఉద్యమాల వారధి ఉద్యమాల ద్వారా పాలకుల మెడలు వంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాల అందించిన సమర్థవంతమైన ప్రజా ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో అణగారిన వర్గాలు ఐక్యమై హక్కులతో పాటు అధికారం కోసం అడుగులు వేయాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ విభాగాల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించగా, ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ, ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి రఘువరన్ మాదిగ గార్లతో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ… అంబేద్కర్ ఉన్నప్పటి నుండి నేటి వరకు మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గాలను ఏకం చేసి దేశవ్యాప్త ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ నిర్మిస్తుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ మాదిగల కోసమే ఏర్పాటు చేసిన, మాదిగల వరకే పరిమితం కాలేదని ఈ సమాజంలో పీడింపబడుతున్న ప్రతి వర్గం పక్షాన నిలబడి తన పోరాటాలను నిర్వహించిందని, పాలకుల మెడలు వంచి అనేక సంక్షేమ పథకాలను ఫలితాల రూపంలో సమాజానికి అందించిందని అన్నారు. ఆరోగ్య శ్రీ అయిన, వికలాంగుల పెన్షన్లైన వృద్ధులు వితంతువుల పెన్షన్లైన ఆకలి కేకల పోరాటంతో రేషన్ కోట బియ్యం పెంపైన ఫాస్ట్ ట్రాక్కోర్టులైన ఇలా ప్రతి వర్గం పక్షాన నిలబడి సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తించిందని గుర్తు చేశారు. ఈ దేశంలో 100% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారేనని, కృష్ణ మాదిగ గారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటాలు చేసి మాదిగల ఉపకులాల చిరకాల ఆకాంక్షైన ఎస్సీ వర్గీకరణను సాకారం చేసుకున్నామని, విద్యా , ఉద్యోగాల్లో వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని కోరారు. జులై 7న మాదిగల ఆత్మగౌరవ ప్రతీకైనా ఎమ్మార్పీఎస్ జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేయాలని అందుకోసం ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ విభాగాలను పునర్నిర్మానం చేసుకొని మాదిగలను శక్తివంతంగా తయారు చేయాలని అన్నార. జులై 7 ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తోడ్పాటు అందించిన అన్ని వర్గాల ప్రజల్ని పిలిచి సన్మానించి కృతజ్ఞత చాటాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కాడిగళ్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఎమ్మెస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండలాల బాధ్యులు శ్రీనివాస్ మాదిగ, మల్లికార్జున్ మాదిగ, విజయ్ మాదిగ, రాములు మాదిగ, ప్రసాద్ మాదిగ, అమృత రాజ్ మాదిగ, వివిధ మండలాల నుంచి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts