ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్-మంత్రి పొంగులేటి
– ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్
– క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
– వారంలోగా రైతు భరోసా జమ
హైదరాబాద్ జూన్ 15(ప్రజాక్షేత్రం):ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి తెలిపారు. సోమవారం కేబినెట్‌లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అనంతరం తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందన్న ఆయన కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లోనే రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని మంత్రి పేర్కొన్నారు.