ఆర్ నారాయణమూర్తి తో మందకృష్ణ మాదిగ భేటీ
హైదరాబాద్ జూన్ 16(ప్రజాక్షేత్రం):మంద కృష్ణ మాదిగ ను సిని నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు, కులగణన మొదలైన అంశాల గురించి ఇరువురు చర్చించారు. ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఐక్య ఉద్యమాలుని ర్వహించాల్సిన అవశ్యకత ప్రజాస్వామిక వాదులపై ఉన్నదని గుర్తు చేసుకున్నారు. చిన్నచిన్న అంశాలను పక్కన పెట్టి, భిన్నాభిప్రాయాలు గౌరవిస్తూనే విశాల ప్రజా ఆకాంక్షల మేరకు కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఆర్ నారాయణ మూర్తి గుర్తు చేశారు. అంతే కాకుండా మందకృష్ణ మాదిగను పద్మశ్రీ అవార్డ్ వరించినందుకు గాను ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేకంగా అభినందించారు. పద్మ శ్రీ అవార్డు పట్ల గతంలో భిన్నమైన అభిప్రాయం వుండేదని, కానీ పద్మశ్రీ అవార్ట్ ను మందకృష్ణకు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చిందన్నారు. నమ్మిన ఆశయం, ఎత్తు కున్న ఎజెండా, మూడు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాట ఫలితమే ఈ పద్మశ్రీ అవార్డ్ అని ఆర్ నారాయణమూర్తి అన్నారు.