రైతుల పంటలు…ప్రాణాలు బడి తీసుకుంటున్న “కుందన టెక్నో టిక్స్ కంపెనీ”
– కాలుష్య కోరల్లో చందన్ వల్లి గ్రామం.
– షాబాద్, చందన్ వల్లి పరిధిలో ప్రమాదకరంగా మారుతున్న కుందన టెక్నో కంపెనీ వ్యర్థులు
– చెరువులు కుంటల్లో జల కాలుష్యం
– చనిపోతున్న చేపలు మూగజీవులు
– మేము బ్రతకాలా సావాలా అంటున్న రైతులు.
– ప్రాణాలను బలి తీసుకుంటున్న కుందన టెక్స్టైల్స్ టెక్నో కంపెనీ.
– నిబంధనలు పట్టించుకోని కంపెనీలపై నో యాక్షన్
షాబాద్ జూన్ 18(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కుందన టెక్నో టెక్స్ కంపెనీ నుంచి కాలుష్యం పెరుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు పరిశ్రమల పరిసరాలలో రసాయనాల జలాలు పారుతున్నాయి. చెరువులు కుంటల్లోకి కెమికల్ నీరు వచి చేరడం వల్ల నీరు కాలుష్యమై మూగజీవులకు ప్రాణాంతకారంగా మారుతోంది. వ్యవసాయ భూములు, త్రాగునీరు పశుగ్రాసం కాలుష్య కాసరాల భారీనా పడడంతో ప్రమాదం పెరిగిపోతుంది. అర్ధరాత్రి వేళల్లో ప్లాస్టిక్ రీసైకిల్ కెమికల్ పొల్యూషన్ వదులుతున్నారని చుట్టుపక్కల గ్రామాలు ఆరోపిస్తున్నారు.
– పెరుగుతున్న కాలుష్యం
షాబాద్ మండలం చందన్ వల్లి గ్రామం పాశమైలారం ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో జల కాలుష్యం ముప్పుగా మారుతుంది. ఈ ఏరియాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చెరువుల్లో చేపల పెంపకం వంటి ప్రధాన ఉపాధి మార్గాలు దెబ్బ తింటున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలు చెరువులలో, మూగజీవాలకు హాని చేస్తున్నాయి. కెమికల్ కలిసిన వ్యర్థాలు చెరువుల్లోకి, కుంటల్లోకి వచ్చి చేరుతుండడంతో ఆ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దెబ్బ తింటున్న ఉపాధిఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రజలు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కొందరైతే ఊరును విడిచిపెట్టి పట్టణాలకు వెళ్లిపోయారు.
– పొంచి ఉన్న పొల్యూషన్ భూతం
కుందన టెక్నో టెక్ కంపెనీ యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను భూమిలోకి వదలడంతో భూగర్భజలాలు విషతుల్యంగా మారిపోతున్నాయి. బోర్ల నుంచి వస్తున్న నీరు పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది. నీటిలో నురగలు, తెట్టు ఏర్పడుతోంది. వరి వేస్తే దిగుబడులు రావడం లేదని, పత్తి పంట ఎదుగుదలలో లోపం వస్తుందని, వేరుశనగ పంట తొలిదశలోనే మాడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఈ భూములు ఏ పంట సాగుకూ అనుకూలంగా ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిశ్రమల ప్రభావం మనుషులకే కాదు, మూగ జీవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక్కడి భూగర్భజలాల వల్ల పండిన గడ్డిని తినడం వల్ల ఆవులు, గేదేల్లో గర్భం-చుడి నిలవడం లేదు. దీంతో మూగజీవాలను సాకడం భారంగా మారడంతో రైతులు వాటిని కబేళాలలకు అమ్మేస్తున్నారు. ఇలాంటి కంపెనీల కాలుష్యంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.
– పంటలు నష్టపోయిన చందన్వల్లి రైతులు
– ఆవదిన వ్యక్తం చూస్తున పొడికిరలా మల్లేష్ ముదిరాజ్
మేము బ్రతకాల సవాలా. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. మాపంటలు పండడం లేదు, పెట్టుబడి పెట్టానని కూడా రావడం లేదు. ఈ కుందన కంపెనీ లో ఉన్న కెమికల్ నిలు మా పంటపొలాల్నీ పాడు చేస్తున్నటువంటి కెమికల్ రసాయనాలు. ఈ సమస్య చందనవల్లి గ్రామ ప్రజలందరికీ ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాను మీ కుందన టెక్స్టైల్స్ టెక్నో కంపెనీని ఇక్కడ నుంచి తొలగించాలని నేను కోరుకుంటున్నాను. మేము బ్రతికే మా భూములపై సాగు చేసుకుని అలాంటి భూములకే ఇలాంటి కల్తీ కెమికల్ మా పంట పొలాలకు వచ్చి మా పొలాలను నాశనం చేసి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీ కుందన టెక్స్టైల్స్ పైన ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడంలేదు. మాకు దిక్కెవరు? మేము నష్టపోతున్న మా పంట దిగుబడులకు బాధ్యులు ఎవరు?
– పంట నష్టపోయిన రైతు బేగారి వెంకట్
నా పేరు వెంకటేష్, నా పొలం కుందన కంపెనీ కి దగ్గరలో ఉంది దగ్గర్లో ఉండటం వలన నేను వేసుకున్న టమాట పంటను మొత్తం పాడు చేసింది కెమికల్ నీళ్లతో మా పంటల్లోపు వస్తున్నటువంటి నీరు మొత్తం కెమికల్ అయ్యి వస్తున్నాయి. నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నాకున్నది ఒకటే దిక్కు నా పొలం ఆ పొలాన్ని మొత్తం పాడు చేస్తున్న కుందన్ కంపెనీని ఇక్కడ నుండి తొలగించాలని అధికారులను కోరుతున్నాము. ఈసారి పంట పెట్టుబడి కూడా రాకముందుపై నా పంట పాడైపోయింది దీనిక నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పకుండా ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని నువ్వు పంట పొలాలని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– చందనవెల్లి గ్రామస్తుడు బేగారి రమేష్
షాబాద్ మండలం చందనవల్లి గ్రామం బేగారి రమేష్ మాట్లాడుతూ చందన వెళ్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి వందన టెక్స్టైల్స్ కంపెనీని మా ఊరి దగ్గర నుంచి తొలగించాలని అధికారులను కోరుతున్నాము ఎందుకు అనగా మా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలలో పంటలు, మూగజీవులు, చేపలు చనిపోతున్నాయి గ్రామంలో ఎంతోమంది అనారోగ్యంతో చనిపోతున్నారు కుందన టెక్స్టైల్స్ కంపెనీలో వాడుతున్న కెమికల్ రసాయనాల వల్ల ప్రకృతిని మొత్తం పాడుచేస్తుంది కావున ఇక్కడి నుండి ఈ కంపెనీని తొలగించాలని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే మా ప్రాణాల కంటే కంపెనీలే ఎక్కువనా? మా ప్రాణాలు పోయేంతవరకు చూస్తూనే ఉంటారా అధికారులు? ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విడ్డూరం. దయచేసి మా ప్రాణాలను, మూగజీవులను మేము సాగు చేసుకుని బ్రతికి పంటలను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని షాబాద్ మండల అధికారులను వేడుకుంటున్నాము.
– భూ నిర్వాసితుల శాఖ సంఘం అధ్యక్షులు నేరటి ఆంజనేయులు ముదిరాజ్
షాబాద్ మండలం చందనవల్లి, హైతాబాద్ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని కంపెనీల పొల్యూషన్, కెమికల్ రసాయనాలు, భూకబ్జాలు ఇలాంటివి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కంపెనీల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు సాగు చేసుకునే పంటలు నష్టపోతున్నారు, మూగజీవులు చనిపోతున్నాయి, ముదిరాజ్ సంగస్తులు చేపల వ్యాపారం చేసుకునేవాకి చేపలు దక్కడం లేదు ఎందుకనగా దగ్గరలో ఉన్న కంపెనీల పొల్యూషన్ మరియు రసాయనాల వల్ల ఎంతో కాలుష్యం పెరిగి ప్రకృతిని పట్టించడమే కాకుండా దగ్గర్లో ఉన్న గ్రామస్తుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. ఎంతోమంది రైతులు పంటలే ప్రాణంగా పెట్టుకుని సాగు చేసుకుని బ్రతికే వారు కానీ వారికి నష్టమే జరుగుతుంది. ఎందుకనగా ఈ కంపెనీల వల్ల పొల్యూషన్ తో రసాయనాలు నీటిలో కలిసి అవే నీళ్లు పొలాలకు వస్తున్నాయి దీనివల్ల పంటలు పాడవుతున్నాయి పెట్టుబడి కూడా రావడం లేదు. దీనిపైన ఎన్నోసార్లు అధికారులకు చెప్పిన ఎవరూ పట్టించుకోరు ఇకనైనా దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను కోరుతున్నాము లేనిపక్షంలో కలెక్టర్ వరకు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నాము. రైతులని కాపాడాల్సిన ప్రభుత్వమే రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చందన్ వల్లి హైతాబాద్ కంపెనీలు. దయచేసి ఇప్పటికైనా అధికారులు మబ్బు విడిచి వీటిపై దృష్టి పెట్టి రైతులను ఆదుకోండి. యదేచ్చగా కొనసాగుతునా పొల్యూషన్, ఇబ్బందులు పడిన గ్రామ ప్రజలు కెమికల్ పొల్యూషన్ వల చుటుపకన గ్రామాల ప్రజలు, మూగజీవులు, చేపలు చనిపోతునాయి. ఎట్టివల చేస్తున్నారని ప్రణాలకికి ప్రమాద్నం ఉండే అవకాశం ఉంది. కాబటి వీలు అయినంత తొందరగా ఈ పొల్యూషన్ నీ ఆపేయాలని అని ప్రభుత్వంనీ గ్రామ ప్రజలు కోరారు. కుందన టెక్స్టైల్స్ కంపెనీ నుండి రసాయనాలు వస్తున్న విధానం ముందుగా అక్కడున్న ప్లాస్టిక్ మొత్తాన్ని రీసైక్లిస్ అని చేసి అక్కడ ఉన్న కెమికల్ని లోపల డంపు చేసి మెల్లమెల్లగా బయటికి వదులుతున్నారు. వర్షం వచ్చినప్పుడు ఒకటేసారి వర్షంలో కొట్టుకుపోతుందని ఆలోచనతో ఒకేసారి వదులుతున్నారు. అందువలన ఇక్కడ ఉన్న రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దయచేసి మా గ్రామాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాము.