Praja Kshetram
తెలంగాణ

మీ అక్రమ కేసులకు భయపడేది లేదు..!

మీ అక్రమ కేసులకు భయపడేది లేదు..!

 

• ప్రభుత్వ వ్యవస్థను ప్రజల రక్షణ కోసం వాడండి.. కానీ రాజకీయ కక్షల కోసం కాదు

– బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష

• ఆరు గ్యారంటీలు అమలు చేసే దాకా ప్రశ్నిస్తూనే ఉంటాం..

• ఓదెలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

పెద్దపల్లి/ఓదెల,జూన్ 22,(ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చినటు వంటి ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అమలు చేయకుండా, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులకు భయపడేదే లేదని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష డిమాండ్ చేశారు.పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష,ఆపార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. ఫార్ములా ఈ – రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావుకు ఏసీబీ నోటీసులు జారీచేసి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నెల 16న ఓదెల మండల కేంద్రంలో ఆందోళనకు దిగి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు,కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపైనే అనేక సెక్షన్ ల క్రింద అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారే కానీ.. రాష్ట్రంలో ఎంతోమంది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ పాలన ఎందుకు దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రజలపై వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థను మహిళల రక్షణ కోసం, ప్రజల క్షేమం కోసం వాడండి కానీ.. మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారో, మళ్లీ అదే చోట ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశామని,మీ అక్రమ అరెస్టులకు,మీ భయభ్రాంతులకు భయపడేది లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగడుగునా నిలదీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts