పేదవేడు సర్పంచ్ మోసం..! కడుపుమడీ ఇంటి ముందు రచ్చ రచ్చ…!
– షాబాద్ మండలం పెద్దవీడు గ్రామం సర్వే నంబర్ 90,147 లో అసైన్డ్ భూములు గుంటల మయం.
– రైతును నిండముంచిన పెద్ద వేడు సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్.
– రైతులకు మాయమాటలు చెప్పు భూముల నుంచి మట్టి మాఫియా దగ్గర్లో ఉన్న కంపెనీలకు దార బోశారు.
– సాగు చేసుకుంటా అని రైతులను మోసం చేసిన సర్పంచ్.
షాబాద్, జూన్ 22(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దవీడు రెవెన్యూ గ్రామం లో సర్వేనెంబర్ 90 , 147 లో, ఆదే గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రస్తుతం మాజీ సర్పంచ్ అయినా గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ తండ్రి నరసింహులు గౌడ్ రైతుల దగ్గర వారి పొలాలను గ్రామ సర్పంచి అని అధికారమో లేక రైతులను మభ్యపెట్టడమో ఏదో విధంగానో గాని రైతుల దగ్గర భూమిలో మట్టి గ్రామ అవసరాల కోసం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మట్టినంత ఇండస్ట్రియల్ కంపెనీలకు తరలించి మీకు కూడా మీ భూములను ఒక లేవలింగ లేనందుకు చదును చేసి సాగుకు పనికి వచ్చేలా భూమిని తయారు చేసి మీకు కూడా కొంత డబ్బులు ఇస్తాను అని రైతుల పొలాల దగ్గర నుండి మట్టి తీసి ఇండస్ట్రియల్ కంపెనీలకు అమ్ముకొని సంవత్సరాల గడుస్తున్న రైతులకు డబ్బులు ఇవ్వలేక వారి భూములను చదును చేయలేక, ఈరోజు రేపు అని చెబుతూ సంవత్సరాలు గడిచిన గాని రైతులకు ఎలాంటి న్యాయం చేయనందున ఈరోజు రైతులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది.
– అసలు ఏం జరిగింది..!
షాబాద్ మండలం పెద్దవేడు గ్రామంలో రైతుల నుంచి భూములను సాగు చేస్తానని తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఆ భూమిలో మట్టి తవ్వి కంపెనీలకు అమ్ముకున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి. 2021 నుంచి 2025 వరకు రైతుల ప్రభుత్వ అసైన్డ్ భూముల సుమారు 70 ఎకరాల భూమి నుంచి మట్టి తవ్వకాలు చేసి రైతులకు ఎటువంటి ఎటువంటి ఆదాయం లేకుండా వాళ్ళ భూములను పాడుచేసి మనకి ఎటువంటి ఉపయోగం లేకుండా భూములను కొల్లగొట్టి ఇష్టానుసారంగా మట్టిని కంపెనీలకు దారం పోశారు .ఈ విషయాన్ని గమనించిన రైతులు ఆదివారం నాడు తేదీ జూన్ 22రోజునా రైతుల కడుపు మండి పెద్ద వేడు మాజీ సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ ఇంటిముందు టెంటు వేసి ధర్నాకు దిగారు. మా భూములు మాకు ఇవ్వమని కోరగా వారిపై దౌర్జన్యంగా మాట్లాడాలని ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా మీ భూమి అడిగితే పిఓటి మీ భూమిని గవర్నమెంట్ కి పట్టిస్తా అని బెదిరింపులు.
– రైతులకు సాగు లేకుండా చేసిన పెద్ద వేడు సర్పంచ్
షాబాద్ మండలంలో గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన 30 మంది రైతులు మోసపోయారని బాధ వ్యక్తం చేశారు. ఆదివారం నాడు శ్రీనివాస్ గౌడ్ ఇంటిముందు టెంట్ వేసి ధర్నాకు దిగి అదే సమయంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్నటువంటి రైతులను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్లో రైతులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.. పెద్దవీరు గ్రామ ప్రజలు కోరుకుంటునది ఏమిటనగా మాకు సాగు చేసుకోవడానికి ఏమీ లేకుండా పెద్ద పెద్ద గుంతలతో తవ్వి ఎటువంటి లాభం లేకుండా చేశాడని మరియు మమ్మల్ని బెదిరిస్తున్నాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా హైథాబాద్ సమీపంలో మట్టి తవ్వకాలు ఎన్నో చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు కూడా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు. అదే విషయానికి గమనించిన గ్రామస్తులు వాళ్ళ కడుపు మండి ఏదైతే అది అని దాదాపు 30 మంది రైతులు ఇంటిముందు ఆందోళన చేయడంతో శ్రీనివాస్ గౌడ్ గర్భస్థలానికి చేరుకుని నాకు దీనికే ఎటువంటి సంబంధం లేదని వాళ్లపై గట్టిగ మాట్లాడుతున్నారని రైతులు తెలుపుతున్నారు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేదు టిప్పర్లకు టిప్పర్లు మట్టి తవ్వి కంపెనీలకు ధారపోసి లక్షలకు లక్షలు ఆదాయం తెచ్చుకొని మాకు చెల్లికి అవ్వ కూడా ఇవ్వకుండా తనకు తానే సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మాకు న్యాయం చేయమంటూ పోలీసులు ఆశ్రయించను రైతులు.
– అధికార పార్టీ అండదండలతోటి ఈ మోసాలు
గతంలో పెట్టేవేడు సర్పంచి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నో మట్టి మాఫియా పైన పత్రిక కథనాల్లో కూడా వచ్చాయని రైతులు తెలుపుతున్నారు.ఎన్ని పత్రిక కథనాల్లో వచ్చిన ఆగని మట్టి మాఫియా రోజురోజుకు దిగజారి పోతున్నారు. అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దందా కొనసాగిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన మట్టిని తరలించేస్తున్నారు. ఈ తవ్వకాలతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి విలువైన వనాలు నేలకూలుతున్నాయి. షాబాద్ మండలంలోని రెవెన్యూ పరిధిలో మట్టి మాఫియా అక్రమ తవ్వకాలకు తెరలేపింది. హైతాబాద్ రెవెన్యూ ప్రాంతంలో పెద్ద సోల్పేట్ సర్వే నంబర్ 350 మొత్తం 120 ఎకరాలు.ప్రభుత్వ భూములను గోరాతి ఘోరంగా అక్రమంగా తవ్వకాలు తీస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నుండి తవ్వకాలు చేసి దగ్గర్లో ఉన్న కంపెనీలకు తరలిస్తున్నారు.ఒక టిప్పర్ మట్టి 4000 నుంచి 8,000 వరకు టిప్పర్ లతో కంపెనీలలో డంపింగ్ చేసి అమ్ముతున్నారు. ప్రభుత్వ భూములు కనిపిస్తే మట్టి మాఫియా పదేపదే తోవ్వుకుంటుంది రాత్రి వేల టిప్పర్లతో తరలిస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో ,ఈ దందా సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి.ఆయా గ్రామాల పరిధిలోని రెవెన్యూ పంచాయతీ కార్యదర్శులు మట్టి అక్రమ రవాణా జరుగుతున్న చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుడండంతో ప్రభుత్వ భూములు గుంతలుగా మారి నీళ్లు నిలిచాయి ,చెడిపోతున్నాయి ఆ గుంటలలో పడి ఎవరైనా గొర్ల కాపరి కానీ మేకల కాపరి కానీ అందులో పడితే ప్రాణాలకే ప్రమాదంగా మారింది. మండల శాఖ అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను, మట్టిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వ్యాపారులు తమ వ్యాపారాన్ని యధేశ్చగా కొనసాగిస్తున్నారు. మండల అధికారులు వెంటనే స్పందించి మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఎర్ర మట్టి దందా మళ్లీ దాదాపు 20 టిప్పర్లతో దండ కొనసాగిస్తుంది. ఎన్ని పత్రిక గత నాలుగు వచ్చిన పట్టించుకోని అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు ఎమ్మార్వో పోలీసులు వీరందరూ కుమ్మక్కై వీల కనుసైకిలోనే, ఈ దండ కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి.మండలంలో జరుగుతున్న మట్టి దంత పై మైనింగ్, పోలీస్, రెవెన్యూ విభాగాల అధికారులు ఆరా తీస్తున్నట్టుగా పైకి చెబుతున్నా, లోలోన మాత్రం వీరి అనుమతులతోనే యదేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా టన్నుల కొద్ది మట్టిని వ్యాపారాలు ఎలా తరలిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితం టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు లోతుగా దృష్టి సారించకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అక్రమ మట్టి తందపై సంబంధిత విభాగాల అధికారులు అందరూ దృష్టి సారించి కట్టడి చేయాలని, లేకపోతే చెరువులు గుట్టలు లూటీ అవుతాయని పలువురు అంటున్నారు. అంతేకాదు అక్రమ మట్టి తరలింపును అడ్డుకొని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. అక్కడికి వెళ్లిన ప్రజాప్రతినిధులకు బెదిరింపులు మీరు ఎలా ఫోటోలు తీస్తారో చూస్తా! మీరు రోడ్లో కారు అడ్డం పెడతారా! మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి! మా భూములు మా ఇష్టం మీరెవరు చూసుకుందాం హైతాబాద్ చౌరస్తా కాడికి రా అని బెదిరింపులు.
– మాకు సాగు చేసుకోవడానికి ఏమీ లేదు
రైతు కావాలి కుమార్.
నా పేరు కావలి కుమార్ పెద్దవేటు గ్రామం , నాకు రెండెకరాల పొలం ఉంది .మా పొలంనీ సాగు చేసుకుంటానని పెద్ద వేడు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ నాకు ఐదు వేలు ఇచ్చి నా భూమిలో సాగు చేసుకోకుండా మట్టిని తవ్వి కంపెనీలకు ధారబోశాడు. నాకు ఇప్పుడు సాగు చేసుకోవడానికి అక్కడ ఏమీ లేదు మొత్తం గుంటలు అందులో నీళ్లు మిగిలాయి నేను ఇలా సాగు చేసుకోవాలి నేను ఎలా బ్రతకాలి నాకు ఇల్లు లేదు నేను ఇంకెలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశాడు . దయచేసి ప్రభుత్వాన్ని చాపాత్ మండల్ అధికారులను కోరుతున్నాను నాకు నష్టపరిహారం చేకూర్చాలని పోలీసులను ఆశ్రయించాను.
– బాధితుడు నరసింహులు
నా పేరు నరసింహులు నాకు ఒక ఎకరం అసైన్డ్ భూమి ఉంది అప్పట్లో మాకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో మేము సాగు చేస్తూ బ్రతికే వాళ్ళు. మమ్మల్ని మభ్య పుచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి మా భూముల్లో మట్టి త్రవ్వకాలు జరిపి అధికారుల అండదండలతో మాపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మాకు నష్ట పరిహారం కావాలి దయచేసి మాకు న్యాయం చేకూర్చాలని అధికారులు కోరుతున్నాం.
– బాధ వ్యక్తం చేస్తున్న రైతు లింగనోళ్ల రాజు
నాకు ఎకరాల భూమి ఉంది. మమ్మల్ని ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. మా భూములు తీసుకొని మా పైనే దౌర్జన్యం మాకు చెల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మా భూముల్లో తవ్వకాలు జరిపి తవ్వకాలు జరిపిన టిప్పర్లకు టిప్పర్లు కంపెనీలకు ధారబోసి కొన్ని లక్షలు సంపాదించాడు కానీ మాకు ఎటువంటి ఆదాయం లేకుండా పోయింది మేము ఒక పేదరిక కుటుంబం మాకు బ్రతుకుతెరువు ఏదీ లేదు ఎప్పుడు మా నాయకుడే అనుకున్న సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఇలా మోసం చేస్తే మాకు దారి ఇంకెక్కడుంది. మా కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలి అందుకే ఈరోజు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముందు ధర్నాకు దిగాము మాకు న్యాయం జరిగేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం.
– బాధితుడు హరిజన్ వీరేష్
నా పేరు హరిజన్ వీరేష్, గ్రామం పెద్ద వేలు సర్వేనెంబర్ 90 147 లో మా గ్రామాల రైతుల పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను సాగు చేసుకుంటానని మమ్మల్ని మభ్యబుచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి మట్టి మాఫియాకు పాల్పడిన శ్రీనివాస్ గౌడ్ ఎటువంటి చెల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఘోరాతి ఘోరంగా మోసం చేశాడు. ఏందయ్యా మాకు నష్టపరిహారం చేకూర్చవ అని అడగగా ఎక్కువ మాట్లాడితే మీ భూములు పి ఓ టీ కింద ప్రభుత్వానికి పట్టిస్తా అని బెదిరింపులు. మాకు నష్ట పరిహారం కావాలి అని అధికారులను వేడుకుంటున్నాను.
– అడ్వకేట్ ప్రసాద్
నా పేరు ప్రసాద్ పెద్దవీడు గ్రామం మా గ్రామాలలో చాలామందిని మోసం చేసినటువంటి పెద్దవేడు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ని తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాము. ఎందుకనగా ప్రజల దగ్గర భూములను సాగు చేసుకుంటా అని మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్లను మోసం చేసి వాళ్ళు ఎదురు తిరిగేసరికి వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏందయ్యా మాకు నష్టపరిహారం ఏదైనా అడగగా మీ అంతు చూసుకుంటా అని బెదిరింపులు. రైతుల భూములు తీసుకొని వాళ్లపైన దౌర్జన్యానికి దిగుతున్న సర్పంచ్ని వెంటనే కష్టార్లకు తీసుకొని విచారణ జరిపించి మా గ్రామస్తులు రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. సుమారు 70 నుంచి 80 ఎకరాల వరకు భూమిలో మట్టితోవి కంపెనీలకు ధారబోసి తనకు తానే ఎదుగుతున్నాడు ప్రజలను మోసం చేసి తిన్నాను ఈ మోసాలు ఎవరూ ఆపేనాధుడు లేడా!.. ఇంకెంతకాలం ఇలా చూసుకుంటూ పోదామని రైతులకు కడుపు మండి శ్రీనివాస్ గౌడ్ ఇంటిముందు ధర్నాకు దిగారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాము.