లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
నిర్మల్ జూన్ 24(ప్రజాక్షేత్రం):మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఎంత మంది అధికారులు ఏసీబీ కి పట్టుబడుతున్న లంచాలకు మరిగిన అధికారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి దొరికాడు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసేరాల్ గ్రామానికి చెందిన గోసకుల రాజేశం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దాని పర్మిషన్ కోసం పంచాయతీ కార్యదర్శి మర్రి శివ కృష్ణను కలిశాడు. అనుమతి ఇవ్వడం కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా.. పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.