Praja Kshetram
తెలంగాణ

రైతు బాగుంటే దేశం బాగుంటుంది : పడమటి అనంత్ రెడ్డి

రైతు బాగుంటే దేశం బాగుంటుంది.

 

– 20 లక్షల సొంత నిధులతో (మసాలా) ఎరువులు పంపిణీ.

– బీఆర్ఎస్ నాయకులు పడమటి అనంత్ రెడ్డి.

కొండాపూర్ జూన్ 24(ప్రజాక్షేత్రం):రైతన్నకు అండగా ఉంటూ వారి సమస్యలను ఆర్థిక పరిస్థితులను గుర్తించి సుమారు 20 లక్ష ల రూ. సొంత నిధులతో 400 వందల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 బస్తాల ఎరువు బస్తాలను పంపిణీ చేసి గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. గుంతపల్లి పడమటి అనంత్ రెడ్డి తన గ్రామంలో రైతన్న కు వర్షాకాలం రైతులు ఎరువులు లేక ఇబ్బంది పడకుండా తన వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశం తో బీఆర్ఎస్ యువ నాయకుడు రైతు బాంధవుడు పడమటి అనంత్ రెడ్డి తన స్వగ్రామమైన గుంతపల్లి లో మంగళవారం రోజు 20లక్షల రూ.సొంత నిధులతో భూమి ఉన్న 400 వందల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3 బస్తాల 20-20-0-13. మరియు 2 బస్తాల యూరియా మొత్తం ప్రతి కుటుంబానికి 5 ఎరువుల బస్తాలను పంపిణీ చేసి రైతు కళ్లల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా అనంత రెడ్డి మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుందని దేశానికి వెన్నుముక రైతన్న అని కొనియాడారు.రైతులు పడే ఇబ్బందులను వారి సమస్యలను వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని తన వంతుగా రైతులకు ఈ సహాయం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు.ఈ సందర్భంగా రైతులు గ్రామస్తులు. యువకులు. అనంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

Related posts