నర్సంపేట పోస్ట్ ఆఫీసు లో ఆధార్ సేవలు పునః ప్రారంభం.
నర్సంపేట, జూన్ 25(ప్రజాక్షేత్రం):నర్సంపేట పోస్ట్ ఆఫీసు లో ఆధార్ సేవలను పునః ప్రారంభించినట్లు నర్సంపేట సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుచేందర్ తెలిపారు. ఈ సందర్భంగా సుచేందర్ మాట్లాడుతూ…. నర్సంపేట పోస్ట్ ఆఫీసు లో ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగా ఆధార్ నమోదు ఉచితం, ఆధార్ లో డెమోగ్రాఫిక్ సవరణలకు 50/- , బయోమెట్రిక్ సవరణలు 15సం లోపు వారికి ఉచితం, 16సం పైబడిన వారికి 100/-,ఆధార్ ప్రింట్ కొరకు 30/- ఛార్జ్ చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.ఆధార్ కి సంబంధించిన ఇతర వివరాలకు నర్సంపేట పోస్ట్ ఆఫీసు లో సంప్రదించగలరని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట పోస్ట్ మాస్టర్ సుధాకర్, పి. ఏ రాజన్, ఎం టి ఎస్ రాజు, పోస్టల్ సిబ్బంది ప్రదీప్,సంపత్, షాబుద్దిన్, క్రిష్ణ కిషోర్,నాగేందర్,తిరుపతి,రవి, అనూష పాల్గొన్నారు.