పెద్దపల్లి జిల్లా ఆర్టీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు..!
పెద్దపల్లి, జూన్ 26(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ అధికారి( ఆర్టీవో ) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీవో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే పక్క సమాచారంతో గురువారం కరీంనగర్ ఏసీబీ (ACB) డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయం పై అటాక్ చేశారు. అధికారులు జిల్లా కేంద్రంలోని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. బయటి వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
