Praja Kshetram
తెలంగాణ

అక్రమంగా మట్టి తరలిస్తున్న 6 టిప్పర్లు సీజ్.

అక్రమంగా మట్టి తరలిస్తున్న 6 టిప్పర్లు సీజ్.

 

– ప్రజాక్షేత్రం దినపత్రిక ఎఫెక్ట్.

– అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు తప్పవు. తాసిల్దార్ అశోక్.

కొండాపూర్ జూన్ 27(ప్రజాక్షేత్రం):ఈనెల 25న మట్టి మాఫియా.. యథేచ్చగా మట్టి అక్రమ తవ్వకాలు. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. అనే కథనం ప్రజాక్షేత్రం దినపత్రికలో ప్రచురించగా అక్రమంగా మట్టి తరలిస్తున్న 6 టిప్పర్లను శుక్రవారం ఉదయం తాసిల్దార్ అశోక్ సిజ్ చేశారు. తాసిల్దార్ వివరాల ప్రకారం కొండాపూర్ నల్లచెరువు నుంచి మట్టిని తగిలిస్తున్న ఆరు లారీలను తహసిల్దార్ అశోక్ సీజ్ చేశారు. వివరాలకు వెళ్తే కొందరు రైతులు నల్ల చెరువు నుంచి తమ పొలంలోకి మట్టిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే గత ఐదు రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నందుకు వాహనాలను శుక్రవారం సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన టిప్పర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

– ఈ సందర్భంగా తాసిల్దార్ అశోక్ మాట్లాడుతూ

అక్రమంగా అనుమతులు లేకుండా కొండాపూర్ మండలంలో ఎక్కడైనా రాత్రి వేళలో, పగలు మట్టి రవాణా జరిగినట్లయితే తగు చర్యలు తీసుకొని వాహనాలను సిజ్ చేయడం జరుగుతుందని అన్నారు.

Related posts