భార్యను చంపి, గోనెసంచిలో మూటకట్టి.. 23 ఏండ్లకు చిక్కాడు
కర్ణాటక జూన్ 29(ప్రజాక్షేత్రం):భార్యను హత్య చేసి.. గోనెసంచిలో మూటకట్టి బస్సులో పడేసి.. లగేజీ అని చెప్పి తప్పించుకున్న కేసులో ఓ వ్యక్తి 23 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయచూర్ జిల్లా మాన్వి తాలుకా హల్దాల గ్రామానికి చెందిన హనుమంత్ హెసునప్ప ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తుండే వాడు. 2000లో కొప్పాల్ తాలుకా రేణుకమ్మను పెళ్లి చేసుకుని గంగావతిలోని గుండమ్మ క్యాంపు ఇంటిలో నివసించాడు. భార్యపై అనుమానంతో 2002లో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గోనే సంచి మూట కట్టాడు. ఆ గోనెసంచిని గంగావతి నుంచి బళ్లారి వెళ్తున్న బస్సులో పెట్టి మధ్యలోనే దిగిపోయాడు. కండక్టర్ సంచిని తనిఖీ చేయగా.. మహిళ మృతదేహం కనిపించడందతో బస్సును నేరుగా కాంప్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. హత్య గంగావతి పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో కేసును అక్కడికే బదిలీ చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే 2006 కేసు విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో హనమంత్ తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. తాజాగా సిర్వారా తాలుకా అంజూర్ గ్రామంలో హమమంత్ ఉన్న సమాచారాన్ని సేకరించారు. అక్కడ నిందితుడు మరో పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నట్లగా గుర్తించారు. పోలీసులు అరు నెలలుగా అతడి కదలికలను గమనించారు. 20ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకుని కోర్టుకు రిమాండ్ చేశారు. 23ఏళ్ల క్రితం 49ఏళ్ల వయసులో భార్యను హత్య చేసిన హనుమంత్ చివరకు 75ఏళ్ల వయసులో 20ఏళ్ల పరారీ జీవితం అనంతరం పోలీసులకు పట్టుబడటం విశేషం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాపం పండిందని..విధిరాతన తప్పించలేరని..కర్మ అనుభవించాల్సిందేనంటూ..తప్పు చేసిన వారు తప్పించుకోలేరని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వయసులో ఉండగా నేరం చేసి తప్పించుకుని ఇన్నాళ్లు మరో కాపురంతో ఎంజాయ్ చేసి చివరకు వృద్ధాప్యంలో పట్టుబడి జైలుకెళ్లితే అతడికి శిక్ష ఏం వేసినట్లంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.