Praja Kshetram
క్రైమ్ న్యూస్

పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు

పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు

 

 

సంగారెడ్డి జూన్ 30(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్లు ఎగిరిపడ్డారు. మంటలను గమనించిన స్థానికులు భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పేలుడు సమయంలో చాలామంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం 15 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Related posts