చెరువుల తలపిస్తున్న ఫతేపూర్ బ్రిడ్జ్
– తూ తూ మంత్రాంగా అధికారుల చర్యలు
శంకర్ పల్లి జూన్ 02(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శంకర్ పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వర్షపు నీరు అంతా రోడ్డుపై చేరి, చిన్న చెరువును తలపిస్తుంది, మోకాళ్ళ ఎత్తుల నీటి నుండి దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి వర్షం పడినపుడల్లా తూ తూ మంత్రాంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం చూపని అధికారులు కేవలం ఒక్కరోజు రాత్రి కురిసిన వర్షానికి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే ముందు ముందు రాబోయే వర్షాలకు ఏలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెండుతున్నారు. నీరు వెళ్లే మార్గం చేయకుండా రోడ్డు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి ఆర్ అండ్ బి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.