రోడ్ల విస్తరణకు షాపుల యజమానులు సహకరించాలి.
– వనపర్తి మునిసిపాలిటీని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా.
– నియోజకవర్గ అభివృద్ధికి 234 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం.
– మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి ప్రతినిధి జులై 03(ప్రజాక్షేత్రం):వనపర్తిలో అసంపూర్తిగా మిగిలిన రోడ్ల విస్తరణకు షాపుల యజమానులు సహకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం వివేకానంద చౌరస్తా నుంచి రామాలయం వరకు ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా రోడ్ల విస్తరణ చేపట్టే రహదారిలో ఆస్తులు కోల్పోయే షాపుల యజమానులను కలిసి విస్తరణకు సహకరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి 234 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని తెలిపారు. జిల్లా కేంద్రంలో 50 కోట్లతో 20 సీసీ రోడ్లు వేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. అలాగే వనపర్తి లో హిందూ స్మశాన వాటిక, రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగు కాలువల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మునిసిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో సమన్వయకర్త లక్కాకుల సతీష్ కుమార్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి, ప్రముఖ వ్యాపారి ఎస్ ఎల్ ఎన్ రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, మాజీ కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్, వినోద్ గౌడ్, చందాపూర్ బాలస్వామి, సింగిల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.