కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.
– తొలి విడతలో 2 లక్షల కార్డుల జారీకి ఏర్పాట్లు..!
హైదరాబాద్ జులై 03(ప్రజాక్షేత్రం):తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జూలై 14, 2025 నుంచి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి విడతలో 2 లక్షలకు పైగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. రేషన్ కార్డుల డిజైన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. లబ్ధిదారులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో తమ రేషన్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేసి కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లబ్ధిదారులను కోరారు.