పేద రైతుల భూమిపై ప్రభుత్వం దౌర్జన్యంగా భూసేకరణ చేపడుతుంది.
– మా భూములు మాకు కావాలని ధర్నా చేస్తున్న రైతులు
– ప్రజా ప్రభుత్వమని చెప్పి పేద ప్రజల భూములు కాజేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్
– కాంగ్రెస్ వస్తే భూ పట్టాలిస్తాదనుకున్నాం కానీ రైతులకు భూమి లేకుండా చేస్తారని అనుకోలేదు
మొయినాబాద్ జూలై 07(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యెన్కెపల్లి వార్డులో గల సర్వే నంబర్ 180లో ఉన్న 99.14 గుంటల భూమిని రైతులు 70 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి భూములు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా లాక్ చేసి, పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నించడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అధికారులు ఆర్డివో చంద్రకళ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం 300 గజాలు ఎకరానికి చొప్పున మీకు ఇవ్వడానికి నిర్ణయించింది. అంతకుమించి మేము ఇవ్వలేమని రైతుల సమక్షంలో ఆమె చేతులెత్తేశారు ఈ యొక్క అవకాశానికి రైతులు నిరాశ వ్యక్తం చేశారు కనీసం ఎకరానికి ఒక 500 గజాలు ఇవ్వమని రైతులు ఆమెతో మొరపెట్టుకున్నారు. ఎంత మరో పెట్టుకున్న మేమెంత కన్నా ఎక్కువ ఇవ్వలేమని మొయినాబాద్ ఎమ్మార్వో గౌతం కుమార్ తెలియజేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఎకరాకి 300 గజాల భూమిని మీకు కేటాయిస్తున్నాము దీనికి మీరు సంతోషంగా ఉంటే మేము పనులు సాగిస్తామని చెప్పి మధ్యాహ్నం వేల జెసిబి యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే పనులు ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని గమనించిన రైతులు సంఘటితంగా అక్కడకు చేరుకొని, జెసిబిని అడ్డగించి పనులను ఆపే ప్రయత్నం చేశారు. రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కుమ్మరి రాము అనే వ్యక్తిని పోలీసులలాటితో కొట్టడం వల్ల వీపు మొత్తం కమిలిపోయింది అలాగే ఇద్దరు మహిళలపై విరుచుకుపడడంతో వాళ్ల బొక్కలు డిస్లోకేటెడ్ అయినాయి. పోలీసులు ఇలా విరుచుకుపోవడం వల్ల రైతుల తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా రైతుల భూమిని వారి అనుమతి లేకుండా ఆక్రమించడమేకాక, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బలప్రయోగం చేయడం, ఈ నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటనపై స్పందించి, రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బాధిత రైతులు కోరుతున్నారు.