Praja Kshetram
తెలంగాణ

దుండిగల్ మున్సిపాలిటీ లో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

దుండిగల్ మున్సిపాలిటీ లో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

 

– అందిన కాడికి దండుకుంటూ? అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు

– అనుమతికి మించిన నిర్మాణాల పైన టౌన్ ప్లానింగ్ అధికారుల ఫుల్ సపోర్ట్

– అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు పెట్టిన పట్టవా?

కుత్బుల్లాపూర్ జులై 09(ప్రజాక్షేత్రం):దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్ లో మూడు అక్రమ నిర్మాణాలు. మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. అనుమతులు మాత్రం జి+2 తీసుకొని జి+4 నిర్మాణాలు చేస్తున్నారు. ఇవి అక్రమ నిర్మాణాలని అధికారులకు తెలుసు కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పరిపాలన నడుస్తున్నప్పటికీ ఇలాంటి అక్రమ నిర్మాణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్ ఉండి కూడా అక్రమ నిర్మాణాల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ లోపమా లేదంటే అక్రమ నిర్మాణాలకు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల తోడు పాటు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు ద్వారా అధికారులకు (18/6/25) రోజున తెలిపినప్పటికీ, ఇప్పటివరకు ఆక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఇది దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు. వాళ్ల తీరు మారదు, అక్రమ నిర్మాణాల పైన చర్యలు ఉండవు.

– అక్రమ నిర్మాణాలపై చర్యలకు జాప్యం ఎందుకు

ఎందుకంటే అక్రమ నిర్మాణదారులకు దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అండతోనే విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కాబట్టి అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అని తెలిసి దాన్ని సక్రమం చేసే పనిలో బిజీగా ఉన్నారా ? అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల వెనుక ఎవరైనా స్థానిక నాయకుల అండదండలు ఏమైనా ఉన్నాయా ? ఉంటే అక్రమ నిర్మాణాలను సక్రమం చేస్తారా ? ఇప్పటికైనా దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వెంటనే ఈ అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో అనుకోని ప్రమాదాలు ఏమైనా జరిగితే అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు???

Related posts