శ్రీరిధి హాబిటేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ – డెవలపర్స్ లో భారీ అక్రమలు.
– ప్రభుత్వ భూమికి కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు.
– ఫైనల్ లేఅవుట్ లేకుండానే ప్లాట్లు అమ్మకాలు.
– అనుమతులు లేకుండానే భారీ ప్రహరీ గోడ నిర్మాణం.
– అధికారులు హెచ్చరించిన ఆగని అక్రమ నిర్మాణాలు.
– నాలా కబ్జా చేసి వెంచర్ కు రోడ్డు ఏర్పాటు
– సమాచారం తెలిసిన సైలెంట్ గా ఉన్న మండల పంచాయతీ అధికారులు
– ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో నాళాలు కబ్జా.
కొండాపూర్ జులై 11(ప్రజాక్షేత్రం):కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లి, గ్రామంలో అనుమతులు లేకుండానే శ్రీరిధి హాబిటేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ డెవలపర్స్ వెంచర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సర్వే నంబర్లు 194, 196, 16, 92లలో గేటెడ్ కమ్యూనిటీగా ప్రహరీ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపడుతున్నారు. ఈ భూముల్లో పలు ప్రభుత్వ నియమావళులు ఉల్లంఘిస్తూ అక్రమంగా ముని దేవునిపల్లి సర్వే నెంబర్ 92 ప్రభుత్వ భూమి లోనుండి రాత్రిపూట జెసిబి, టిప్పర్ల సహాయంతో వెంచర్ లో ఉన్న రోడ్ల నిర్మా ణం కొరకు అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. పెద్దగుట్ట కింద ఉన్న పెద్ద వాగును కబ్జా చేసి అందులో ప్రహరీ గోడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మనసాన్పల్లి గ్రామం నుండి పెద్దవాగులోకి నాలా సంవత్సరం క్రితం 12 ఫీట్లు ఉండగా ప్రస్తుతం దాన్ని పూడిచి మూడు పీట్లుగా మార్చారు. ఇరిగేషన్ అధికారులకు ఆధారాలతో సహా సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియని పరిస్థితి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92లో భారీ ప్రహరీ గోడ నిర్మించారు. నాళాల కబ్జా నీటి ట్యాంకుల నిర్మాణం మొదలైన పనులు చేపడుతున్నారు. గ్రామ పరిధిలోని రైతుల పొలాలకు వెళ్లే మార్గాలను కూడా మూసివేయడం వల్ల స్థానిక రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంచర్ కు సంబంధించి ఫైనల్ లేఔట్ అనుమతి రాకముందే ఆకర్షణీయంగా రంగురంగుల బ్రోచర్లు ముద్రించి రోడ్లపై పాంప్లెట్లు పట్టుకొని ప్లాట్లు అమ్మే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
– జిల్లా అధికారులు హెచ్చరించిన ఆగని అక్రమాలు.
గతంలో ఇలాంటి అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాలపై అధికారులు కూల్చివేతలు జరిపి మళ్లీ అక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని పంచాయతీ జిల్లా అధికారి డి ఎల్ పి ఓ అనిత హెచ్చరించారు.
– అనుమతుల కోసం ఫోన్ చేస్తే నెలలైనా ఫోన్ ఎత్తని ముని దేవునిపల్లి పంచాయతీ కార్యదర్శి.
– తాసిల్దార్ వివరణ
ప్రభుత్వ భూమి కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో నుండి అక్రమంగా మట్టి తరలించిన తగు చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించే ఈ విధమైన అక్రమ ప్రాజెక్టులపై మండల అధికారులతో పాటు జిల్లా అధికారులు వెంటనే విచారణ జరిపి, పనులను నిలిపివేయాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.