మణికొండ మున్సిపల్ మారుతి నగర్ పార్క్ స్థలం కబ్జా
రాజేంద్రనగర్, జూలై 22(ప్రజాక్షేత్రం): గండిపేట్ మండలం మణికొండ మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్ కాలనీ లో మంగళవారం టిఆర్ఎస్ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి నగర్ కాలనీకి లేఅవుట్ ప్రకారం గత 2012 సంవత్సరంలో 1100 గజాల పార్క్ స్థలానికి శంకుస్థాపన చేశారని కాలనీవాసులు తెలిపారు. అభివృద్ధి చెయ్యకపోగా కానీ ఇప్పుడు 600 గజాలు పార్కు స్థలం మాత్రమే మిగిలిందని కాలనీ ప్రజలు బిఆర్ఎస్ నాయకులతో వాపోయారు, మిగతా పార్క్ స్థలమంతా కబ్జాకు గురైందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు, కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకపోగా అతి కష్టం మీద 600 గజాలు పార్కు కేటాయించడం జరిగిందన్నారు. మారుతీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2, 3 మరియు 4 ఎలక్ట్రికల్ పోల్స్ తో సహా అక్రమానికి గురైందని అన్నారు. రోడ్ నెంబర్ 2 చివరన ఒక బిల్డర్ పూర్తిగా ఆక్రమించడం జరిగిందని పేర్కొన్నారు. మారుతి నగర్ కాలనీ సమస్యల వలయంగా మురుగు నీరు నిలిచి దోమల బెడద తీవ్రత ఎక్కువ ఉందని స్థానికులు తెలిపారు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేశారు. లేనిపక్షాన బి.ఆర్.ఎస్ పార్టీ చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ళ ధనరాజ్, ముఖ్య కార్యదర్శి గుట్టమీది నరేందర్, రాజకీయ సలహాదారుడు బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, మహేశ్వరం బాబు రావు, బండమీది మల్లేశ్, మాల్యాద్రి నాయుడు, మహేశ్వరం సుమన్, అశోక్, యాలల కిరణ్, ఆరిఫ్ మహమ్మద్, భాను చందర్, బిట్లు రాజు, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
