Praja Kshetram
తెలంగాణ

రేవంత్..రాజీనామా చేస్తావా?చేయూత ఫింఛన్లు పెంచుతావా ?

రేవంత్..రాజీనామా చేస్తావా?చేయూత ఫింఛన్లు పెంచుతావా ?

 

– అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదు.

– రేవంత్, కేసీఆర్ లకు పేదల బాధలు పట్టవు.

– నాకు పేదరికం తెలుసు,ఆకలి బాధలు తెలుసు.

– అందుకే పేదల కోసం పోరు ఆపేది లేదు.

– చేవెళ్ల, రాజేంద్రనగర్ మహాగర్జన సన్నాహక సదస్సులో గర్జించిన మందకృష్ణ.

చేవెళ్ల ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు, ఆసరా పెన్షన్ రూ.4వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ.15వేలు పెంచుతావా లేదంటే రాజీనామా చేస్తావా అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆగస్టు 13న ఎల్భీ స్టేడియంలో మహాగర్జనకు సంబంధించి చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల సన్నాహక సదస్సు శనివారం చేవెళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50లక్షల మంది లబ్ధిదారులున్నారని, పెంచుతామన్న పెన్షన్ పెంచకపోవడం వల్ల నెలకు వెయ్యి కోట్లు అంటే 20నెలలకు 20వేల కోట్లు పేదలు నష్టపోయారని గరం అయ్యారు. చేయూత పెన్షన్ దారుల నోట్లో మట్టి కొట్టి, రుణమాఫీ కింద 20వేల కోట్లను ఉన్నోళ్లకు పెట్టిండని చెప్పారు.అందుకే అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదు.రేవంత్ భూస్వాముల కుటుంబాల్లో,కేసీఆర్ గడీల కుటుంబాల్లో పుట్టారు అందుకే వారికి పేదల భాధ పట్టదు.నాకు పేదరికం తెలుసు,ఆకలి బాధలు తెలుసు అందుకే మీ కోసం కొట్లాడుతున్న,చేయూత పెన్షన్ దారుల మహాగర్జనకు అందరూ తరలి రండి పెన్షన్ పెంచే వరకు పోరు ఆపేదే లేదని మందకృష్ణ మాదిగ భరోసా నిచ్చారు.

Related posts