హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఓపెన్..
– మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
రాజేంద్రనగర్ ఆగస్టు 08(ప్రజాక్షేత్రం): గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ సాగర్ జలాశయం నాలుగు గేట్లను అధికారులు శుక్రవారం ఓపెన్ చేశారు. ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కుల నీటిని మూసి లోకి వదిలారు. అయితే గురువారం రాత్రి ఒక గేట్ ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎత్తారు. హిమాయత్ సాగర్ కి మరింత వరద నీళ్లు పెరగడంతో ఉదయం మరో మూడు గేట్లు ఓపెన్ చేశారు.
హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.10 ఫీట్ల నీరును అధికారులు మెయింటెన్ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
