Praja Kshetram
తెలంగాణ

చెరువును తలపిస్తున్న రిత్విక్ కాలనీ ప్రధాన రోడ్డు.

చెరువును తలపిస్తున్న రిత్విక్ కాలనీ ప్రధాన రోడ్డు.

 

– మూడు నెలలు గడిచిన పూర్తికాని సి సి రోడ్డు నిర్మాణం.

– నత్త నడకన కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం.

– సిసి రోడ్డు కోసం త్రవ్విన కాలనీ రోడ్డులో వరద ప్రవాహం.

– వానొస్తే కాలనీ వాసులకు నరకమే.

– రోడ్డు నిర్మాణం త్వరగ పూర్తీ చేయాలని కాలనీ వాసుల అభ్యర్థన.

శంకర్ పల్లి ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి రిత్విక్ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం కోసం మే నెలాఖరులో శంకుస్థాపన జరిగిన ఇప్పటి వరకూ రోడ్డు పూర్తి చేయలేకపోవడం వలన కాలనీ వాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సిసి రోడ్డు నిర్మాణం కోసం త్రవ్విన కాలనీ రోడ్డులో చిన్నపాటి వర్షానికి కూడా వరదను తలపిస్తుంది. అంతే కాకుండా వర్షం తగ్గిన తర్వాత నీరు అలాగే నిల్వ ఉండటం వల్ల కాలనీ వాసులకు రాకపోకలకు చాల ఇబ్బందిగా మారింది. విద్యార్థులు స్కూలుకు వెళ్లిరావాలన్న, కలని వాసులు బయటికే వెళ్లి రావాలన్న, నిల్వ నీరు, బురద వల్ల జారీ పడటం జరుగుతుంది. నిల్వ నీరు వల్ల దోమల బెడద ఎక్కువై కాలనీ వాసులు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కాలనీ ప్రధాన రోడ్డు నిర్మాణం వీలైనంత త్వరగాపూర్తి చేయించాలని సదరు అధికారులను, నాయకులను, కాలనీ వాసులు అభ్యర్థిస్తున్నారు.

Related posts