మమ్మల్ని ఆదుకునే వారే లేరా
– చేవెళ్ల మండల కేంద్రంలోని ఎస్సి బాయ్స్ హాస్టల్ పరిస్థితి ఇది.
– రోడ్డు పైన వెళ్లే వర్షపు నిరంతా హాస్టల్ లోకే వస్తున్నాయి.
– హాస్టల్ గ్రౌండ్ లో నీరు రాకుండా ప్రత్యన్మయ మార్గం చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
చేవెళ్ల ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ ఎస్సి(బాలుర) వసతి గృహ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చేవెళ్ల గ్రామం లోపలికి వెళ్ళడానికి వేసిన సిసి రోడ్డు ఎత్తుగా వేయడంతో వర్షం పడ్డప్పుడల్లా ఆ నీరంతా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లోనికి అదేవిదంగా ఎస్సీ బాలుర వసతి గృహంలోనికి వెళుతున్నాయి. వర్షం పడితే చాలు హాస్టల్ లో విద్యార్థులు బయటకు వెళ్ళడానికి రాదు, బయట ఉన్నవారు లోపలికి వెళ్ళడానికి రాదు తప్పదని వెళితే పూర్తిగా బురద మాయంగా మారిన హాస్టల్ గ్రౌండ్ లో జరి పడిపోతే జరిగే ప్రమాదం ఊహించలేం ఎందుకంటే వారు చిన్న పిల్లలు సంక్షేమ శాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా. ఇకనైనా హాస్టల్ లోని సమస్యని పట్టించుకోని విలేజ్ రోడ్డు వర్షపు నీరు హాస్టల్ లోని గ్రౌండ్ లోకి రాకుండా ప్రత్యన్మయ మార్గం చూడాలని విద్యార్థులు కోరరుతున్నారు.
– ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా.
రోడ్డు పై నుండి వెళ్లే వర్షపు నీరు అదేవిదంగా, బాలికల ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నుండి వచ్చే వర్షపు నీరు హాస్టల్ లోకి రాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే హాస్టల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలని అన్నారు.
(పిడిఎస్ యు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపూరం రాజేష్.
