హుండీ దొంగల అరెస్ట్:ఎస్సై శివకుమార్
పెద్దమందడి ఆగష్టు 13(ప్రజాక్షేత్రం):పెద్దమందడి, మణిగిల్ల గ్రామాల శివారులో గల చౌదరిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ దొంగతనం చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. గోపాల్పేట మండలం తాడిపర్తికి చెందిన మహమ్మద్ షఫీ, షేక్ రసూల్, మహమ్మద్ అన్వర్ లు కార్, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జల్సా లకు అలవాటు పడి ఈనెల 7న మధ్యరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలో ఉన్న 25వేల నగదు స్వామి ఆభరణాలకు చెందిన వెండి వస్తువులను దొంగిలించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీల ఆధారాల మేరకు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం ఒప్పుకొని హుండీని జగత్ పల్లి చెక్ డ్యామ్ లో వేసినట్లు ఒప్పుకున్నారని ఎస్సై శివకుమార్ తెలిపారు. అలాగే డిసెంబర్లో బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో చౌడేశ్వరి ఆలయంలో ఇదే మాదిరి దొంగతనానికి పాల్పడి పదివేల విలువగల వస్తువులు అమ్మి ముగ్గురు సమానంగా పంచుకున్నట్లు వారి విచారణలో తెలిపినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుండి కొంత డబ్బుతో పాటు ట్రాలీ ఆటో రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
