వలిగొండ లో సంగెం బ్రిడ్జి వద్ద మూసి వాగును పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు
వలిగొండ ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం మూసి బ్రిడ్జిని బుధవారం రోజున జిల్లా కలెక్టర్ హనుమంతరావు సుధీర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి జంట నగరాలు కురిసిన భారీ వర్షం మూసి బ్రిడ్జి పై నీటి ప్రవం అధిక కావడంతో. మూసి వాగులో ఉన్న గుర్రపు డెక్క ఆకును ఎంపీడీవో జలంధర్ రెడ్డి పర్యవేక్షణలో సంగెం కార్యదర్శి ఉదయం నుండి జెసిబిల సహాయంతో గుర్రపు డెక్క ఆకును తొలగిస్తున్నారు. ఈ పర్యవేక్షణలో వలిగొండ మండల తహసిల్దార్ దశరథ ఎస్సై యుగేందర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే మూడు రోజుల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారి ప్రజలకు తెలిపారు.
