Praja Kshetram
తెలంగాణ

కార్మికుల అరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తా: ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి

కార్మికుల అరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తా: ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి

 

– చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉచిత వైద్యశిభిరానికి విశేష స్పందన 2వేల మందికి పరీక్షలు మందులు పంపిణీ

చర్లపల్లి ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):పారిశ్రామికవాడలోని కార్మికుల అరోగ్య పరిరక్షణ కోసం చర్లపల్లి పారిశ్రామికవాడలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం, చర్లపల్లి ఐలా, లయన్స్ క్లబ్ అప్ గోల్డెన్ జూబ్లీ, లయన్స్ ల్లబ్ అఫ్ హైదరాబాద్ ఇండస్ట్రీన్ వారి అధ్వర్యంలో బుదవారం ఏర్పాటు చేసిన ఉచిత మల్టీ వైద్యశిభిరంకు విశేష స్పందన లబించింది. జీనియా అసుపత్రి, ఏసియన్ ఇనిస్ట్యూట్ అప్ నెఫ్రాలజీ, రెనోవా డిడిహెచ్ ఆసుపత్రి, ఎమ్ ఎస్ రెడ్డి లయన్స్ ఐ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్యశిభిరంలో రెండు వేల మందికి జెనరల్ చెకప్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, గుండె, కంటి, కిడ్నీ, క్యాన్సర్ స్రీనింగ్ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. అలాగే 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించి రెండు వందల మందికి కంటి అద్దాలు అందజేశారు. చేసి ఈకార్యక్రమంలో ముఖ్య అతిదిగా ఉప్పల్ ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్ లు పాల్గొని వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో చర్లపల్లి పెద్ద పారిశ్రామికవాడ అని ఇక్కడ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు డి. శ్రీనివాస రెడ్డి, చర్లపల్లి ఐలా అధ్యక్షుడు కె గోవిందరెడ్డి, మాజీ ఐలా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, పిఎస్ మోహన్, రాఘవయ్య, గంగాధర్ బాబు, సుధాకర్ రెడ్డి, వైద్య సిబ్బంది, పారిశ్రామిక వ్యక్తులు తదితరులు పాల్గొన్నాణరు.

Related posts