Praja Kshetram
తెలంగాణ

మూలమల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు.

మూలమల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.

 

– రహదారి తాత్కాలిగా మరమ్మతులకు పది లక్షల రూపాయల మంజూరు కి వినతి

మక్తల్ ప్రతినిధి ఆగస్టు 13,(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ రహదారి తాత్కాలిక మరమ్మతులకు పది లక్షల రూపాయల మంజూరు చేయాలని మూలమల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరికి మంగళవారం రోజు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి రహదారి మరమ్మతులకు త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామ అధ్యక్షులు పి. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వీరి వెంట గ్రామ నాయకులు నరేష్, ఆనంద్, శేఖర్, జగదీష్, రాజు తదితరులు ఉన్నారు.

Related posts