Praja Kshetram
తెలంగాణ

హలో పెన్షన్ దారులారా చలో పరిగి ఆగస్టు 16న

హలో పెన్షన్ దారులారా చలో పరిగి ఆగస్టు 16న

 

పరిగి ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా కోడూరు మండలం మంచన్పల్లి గ్రామంలో పూడూరు మండల ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి చిటిగిద్ద కిష్టయ్య మాదిగ అలాగే పూడూరు మండల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఏసు మాదిగ గ్రామ ఎమ్మార్పీఎస్ చేతయు పెన్షన్దారులు వితంతు వికలాంగులు ఒంటరి మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కిష్టయ్య మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆగస్టు 16న పరిగి రాబోతున్నారు కనుక సిఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 నెలలు గడుస్తున్నప్పటికీ పింఛన్దారుల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల ఇంచార్జి చిట్టిగిద్ద కిష్టయ్య మాదిగ అన్నారు. వికలాంగులు వితంతు ఒంటరి మహిళ పెన్షన్ పెంపు కోసం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ పరిగి సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టికాబట్టి ప్రతి ఒక్క చేయూత పెన్షన్ దారులు వితంతు వికలాంగులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు.

Related posts