న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీలో నూతన కమిటీ ఎన్నిక
– ప్రెసిడెంట్ గా సుబేదార్ సయ్యద్ రహమతుల్లా, సెక్రెటరీ గా ప్రవీణ్ కుమార్.
కాప్రా ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):ప్రజల మధ్య ఐకమత్యానికి కాలనీలు ఎంతో ఉపయోగపడుతాయి. కుటుంబాల మధ్య స్నేహం, మమతానుబంధాలు పెంపొందించడంలో కాలనీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాలనీలు ఆహ్లాదకరంగా ఉండాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా.. సమస్యలు సత్వారమే పరిష్కారం కావాలన్నా వెల్ఫేర్ అసోషియేషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా కాప్రా పరిధి జమ్మిగడ లో ఉన్న న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్‌కు శుక్రవారం ఏకగ్రీవంగా కమిటీ ఎన్నికైంది. న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సుబేదార్ సయ్యద్ రహమతుల్లా, సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, క్యాషియర్ హుస్సేన్ జానీ షేక్, వైస్ ప్రెసిడెంట్ విజేందర్ పటేల్, విజయలక్ష్మి, సత్యనారాయణ ,జైంట్ సెక్రెటరీ శేఖర్, మహాలక్ష్మి, మిన్నారావ్, మాజీ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు, సిహెచ్ శ్రీను, జి ఆనంద్, అడ్వైజర్స్ సింగం నరసింహ, తారకేశ్వరరావు, ఆనందరావు, ఎన్ పాండు, ఎన్నికయ్యారు. ఎన్నికైన కమిటీకి డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్, జనరల్ సెక్రటరీ సుంకు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి, అల్లూరుయ్య, పాకాల రాజన్న, ఓబిసి రాష్ట్ర కన్వినర్ పాతకోటి రామలింగం సింగం కిరణ్ కాలనీవాసులు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ సుబేదార్ సయ్యద్ రహమతుల్లా, ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. కాలనీలోని ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతూ సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు. కాప్రా జమ్మిగడ్డ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచేలా న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకు కాలనీలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తమ ఎన్నికకు సహకరించిన కాలనీ వాసులందరికీ ఈ సందర్భంగా నూతన కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
