Praja Kshetram
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలి 

ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలి

 

– కరీంనగర్ నియోజకవర్గంలో ఇండ్ల పంపిణీ చేయాలి.

– ఇంతవరకు ఇండళ్లను కేటాయించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు.

– నాయకుల అంతర్గత సమస్యల్లో పేదలను బలి చేయడం సరికాదు.

– అధికారులు అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు.

– లేని పక్షాన అర్హులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన జేఏసీ జిల్లా ఇంచార్జ్ అఖిల్ పాషా

కరీంనగర్ నియోజకవర్గం ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించిన పట్టాల పంపిణీ నిర్మాణాలు పలు జిల్లాలో, పలు నియోజకవర్గాల్లో జరుగుతున్నా ఇంత వరకు కరీంనగర్ నియోజకవర్గంలో అమలు కాకపోవడం బాధాకరమైన విషయమని ఇట్టి విషయం పై కరీంనగర్ జిల్లా అధికారులు కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ప్రజావాణి లో బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ తరపున కమిటీ సభ్యులతో కలిసి జేఏసీ కరీంనగర్ ఇంచార్జి అఖిల్ పాషా జిల్లా కలక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అనంతరం అఖిల్ పాషా మోడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ నాయకుల ఆశ్రద్దతో మరియు వారి అంతర్గత సమస్యల వల్ల కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మరియు కరీంనగర్ పట్టణ డివిజన్లలో ఇందిరమ్మ కమిటీలు వెయ్యకుండా అర్హులైన పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కరీంనగర్ నియోజకవర్గంలో అమలు కాకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. రాజకీయ నాయకుల అంతర్గత సమస్యలను పేద ప్రజలపై చూయించడం హేయమైన చర్య అని ఇందులో అధికార యంత్రాంగం కూడా పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కింని మొదలు పెట్టి ఆరు నెలలు కావొస్తున్నా, పలు జిల్లాల్లో, కరీంనగర్ నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గాలు మనకొండూర్, హుజురాబాద్, చొప్పదండి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నా కూడా కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తులు పెట్టుకున్న పేదప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న ప్రస్తుతం మనకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి కరీంనగర్ నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేశారు, జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న మిపై కరీంనగర్ నియోజకవర్గ బాధ్యత మీది కాదా అని నిలదీశారు. కొంత మంది రాజకీయ నాయకుల అంతర్గత కలహాలు, వర్గాల పోరు వల్ల కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలు నష్టపోతున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రి వర్గం మరియు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీలో నాటక ధర్నా చేస్తూ కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ ఇంచార్జి ని తొలగించి అగ్రవర్ణాలకు కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి పగ్గాలు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఇంచార్జి ని నియమించడానికి బీసీ, ఎస్సి, ఎస్టీ మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయ నాయకుల అంతర్గత సమస్య వల్ల ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత జిల్లా అధికారులు చొరవ తీసుకొని వెంటనే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలకు ఇండ్లను కేటాయించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల అర్హులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు సందేబోయిన ప్రసాద్ యాదవ్, భూతం నాగరాజు, రాధారపు కుమార్, అలావోద్దీన్, ఎండి.వాజిత్ , సిరిసిల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts