“బాబు షూరిటీ మోసం గ్యారంటీ” క్షేత్రస్థాయిలో జరగాలి
– ప్రతి గడపకు వెళ్ళి ప్రజలను చైతన్య పరచాలి
– 31వ తేదీలోగా వార్డు, బూతు స్థాయి కమిటీలు పూర్తి కావాలి
– దక్షిణ సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
విశాఖపట్నం, ఆగష్టు 18(ప్రజాక్షేత్రం):మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ వైసీపీ రథసారదులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసీలమెట్ట కార్యాలయంలో సోమవారం ఉదయం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. “బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం” పై పలు సూచనలు ప్రణాళికలు చేశారు. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలని, ప్రతి గడపను టచ్ చేసి ప్రజలను చైతన్య పరచాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఫెయిల్యూర్ పాలన, బాబు చేస్తున్న మోసాలను ఎండగట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న పేద ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలన్నారు. దానికోసం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారికి అధిష్టానం మంచి గుర్తింపునిస్తుందని తెలిపారు. వార్డు స్థాయి, బూతు స్థాయిలలో కమిటీని వేసి ఈ నెల 31వ తేదీ లోపు దక్షిణ కార్యాలయంలో సమర్పించాలనీ సూచించారు. వాటిని అధిష్టానంకి పంపిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టుతున్న చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ విధివిధానాలను తిప్పి కొట్టాలన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
