Praja Kshetram
తెలంగాణ

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు:అకునూరి మురళి

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు

 

– సీఎం మీద విమర్శలు చేసిన అకునూరి మురళి

హైదరాబాద్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఈజ్ రన్నింగ్ ఔట్. రెండేళ్లు అయిపోయాయి అప్పుడే. చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్నది రెండేళ్లే. ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, వనరులు, బడ్జెట్ వెచ్చించాలి. ముఖ్యమంత్రి, అధికారులు ఈ రంగంలో ఇంకా ఎక్కువ పనిచేయాలి. ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది.. అది కరెక్ట్ కాదు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని మేము నివేదిక ఇచ్చినం. మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు వాళ్లు స్వంత పైసలు పెట్టుబడి పెట్టి పిల్లలకు వండిపెడుతున్నారు.  వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారు. వారికి ఎప్పుడో అయిదేళ్ల క్రితం రేట్లు ఇస్తే వారు ఎలా బతకగలుగుతారు? వారికి వారానికొకసారి చెల్లింపులు జరపాలని, మూడు నెలలకు, ఆరు నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుంది అని మేము సూచించాం. మేము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్టు ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదు – ఆకునూరి మురళి, తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్

Related posts