వనపర్తి లో ఘనంగా బోనాల పండుగ
వనపర్తి, ఆగస్టు 19 (ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం బోనాల (పోచమ్మ పండగ) పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రతి శ్రావణమాసంలో మఖ కార్తే ప్రారంభం అయిన తర్వాత ప్రతి మంగళ, శుక్రవారాలలో బోనాలు సమర్పిస్తారు.మొదటి బోనమును దేవాలయ వంశంపార పర్య ధర్మకర్తలు చుక్క సత్యం కుటుంబ సభ్యులు మొదట సర్కార్ బోనం ను పోచమ్మ తల్లికి సమర్పిస్తారు. అనంతరం పట్టణ ప్రజలు పోచమ్మ తల్లిని దర్శించుకుంటారు. మహిళలు, చిన్నారులు ఉదయమే తల స్థానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి బోనం కుండకు పసుపు, కుంకుమ, వేపమండలతో అలంకరించి, నైవేద్యము వండి అలంకరించిన బోనం కుండలో పేట్టి తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ దేవాలయంలో పోచమ్మ తల్లికి బోనం, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలలను చల్లగా చూడాలని తల్లిని వేడుకున్నారు.
